నామినేష‌న్ దాఖ‌లు చేసిన గాయ‌త్రి ర‌వి..

102
Gayatri ravi
- Advertisement -

బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్ధానానికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు గాయ‌త్రి ర‌వి. అసెంబ్లీలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, గంగుల క‌మ‌లాక‌ర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వ‌ర్, త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు గ‌న్‌పార్కులోని అమ‌ర‌వీరుల స్థూపానికి ర‌వి నివాళుల‌ర్పించారు. ఆయ‌న ప‌ద‌వికాలం రెండేళ్లు ఉండ‌నుంది. ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్య‌మైంది.

- Advertisement -