రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి..

57
ktr
- Advertisement -

రాష్ట్రంలో పెట్టుబడులో లక్ష్యంగా లండన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌కు చెందిన స‌ర్ఫేస్‌ మెజెర్ మెంట్ సిస్ట‌మ్స్ పెట్టుబ‌డులు పెట్టేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది. పార్టిక‌ల్ క్యారెక్ట‌రైజేష‌న్ లాబొరేట‌రీ ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

మంత్రి కేటీఆర్‌తో స‌ర్ఫేస్‌ మెజెర్ మెంట్ సంస్థ ఎండీ భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో 7 వేల చ‌.మీ. వైశాల్యంలో ల్యాబొరేట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల‌లో దీనిని విస్త‌రిస్తామ‌ని…. ఈ ల్యాబ్‌ను జాతీయ‌, అంత‌ర్జాతీయ ఫార్మా కంపెనీల ఔష‌ధ ప్ర‌యోగాలకు వేదిక‌గా చేస్తామ‌ని వెల్లడించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఫార్మా రంగంలో హైద‌రాబాద్ తిరుగులేని ఆధిప‌త్యానికి ఇదో నిద‌ర్శ‌న‌మ‌ని ….ఏ రాష్ట్రానికి కూడా లేని అనుకూల‌త‌లు హైద‌రాబాద్‌కు ఉన్నాయ‌ని తెలిపారు.

- Advertisement -