ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ లేటెస్ట్‌ అప్‌డేట్‌..

78
Project K
- Advertisement -

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే కథానాయిక కాగా, ఓ ముఖ్యపాత్రకు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీని ఎంపిక చేశారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

కాగా, ఈ మూవీ నుండి కొద్దికాలంగా ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోవడంతో ప్రభాస్‌ ఫ్యాన్‌ నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌కు ట్వీట్‌ చేశాడు. గతంలో “రాధేశ్యామ్ విడుదల తర్వాతే అప్ డేట్లు” అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ “అన్నా గుర్తున్నామా” అంటూ అడిగాడు ఆ అభిమాని. దీనికి స్పందించిన నాగ్ అశ్విన్ “గుర్తున్నారు” అంటూ బదులిచ్చారు. అంతేకాదు, ‘ప్రాజెక్ట్ కె’ వివరాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.

“ఇప్పుడు ఒక షెడ్యూల్ పూర్తయింది. అందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఉంది. అందులో ప్రభాస్ ఎంతో కూల్ గా కనిపిస్తాడు. జూన్ చివరి వారం నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభమవుతుంది. రిలీజ్ విషయానికొస్తే ఆ లిస్టులో మనం లాస్టు కదా…! కాబట్టి, మరెన్నో అప్ డేట్లు ఇవ్వడానికి బోలెడంత టైముంది. ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం కోసం అందరం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం” అంటూ నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో వివరించారు.

- Advertisement -