తెగ తాగేస్తున్నారు..!

93
beer sales
- Advertisement -

భానుడు భ‌గ‌భ‌గ మంటున్నాడు. ఎండ‌వేడిమి త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. భానుడి ప్రతాపాన్ని త‌ట్టుకోవ‌డానికి చల్లని పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మందుప్రియులు మాత్రం దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కువగా చల్లని బీర్లు లాగేస్తున్నారు.

దీంతో రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. ఇక‌ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీర్ల అమ్మకాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. గ్రేట‌ర్ ప‌రిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జనవరి నుంచి మే 15 వరకు జరిగిన మద్యం విక్రయాల్లో బీర్లదే హవా.

ఈ మూడు జిల్లాల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో గతేడాది 483 కోట్లు రాగా, ఈ ఏడాది ఇప్పటికే 703 కోట్ల ఆదాయం సమకూరించింది. మేడ్చల్ జిల్లాలో గతేడాది రూ. 59 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటికే రూ.146 కోట్ల ఆదాయం ఒక్క బీర్ల విక్రయాల ద్వారానే ఎక్సైజ్ శాఖకు చేరాయి. మే 15 వరకు రంగారెడ్డి జిల్లాలో 4,68,56,640, హైదరాబాద్‌లో 1,74,20,700, మేడ్చల్‌ జిల్లాలో 97,16,424 బీర్లు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -