సీఎం కేసీఆర్ పాలన దక్షత,అభివృద్ధి సంక్షేమ పథకాలు,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి పని చేయడానికి నిర్ణయించుకొని మెండోరా మండలం ధూద్గామ్ గ్రామానికి చెందిన బీజేపీ మండల ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ మరియు బుస్సాపూర్ సొసైటీ డైరెక్టర్ అయిలి నరేష్ మరియు అతని అనుచరులు 25 మంది యువకులు మంత్రి వేముల సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పార్టీలో చేరిన వారిలో మల్లేష్, సరికేల సంజయ్, మురళి, మతిన్ ఖాన్, విజయ్, హరీష్, ప్రదీప్, చినబాబు, జ్ఞాని, రాజు, సుభాష్, ప్రశాంత్, దిలీప్ రాకేష్, దేసు అక్షయ్, రాము శ్రీకాంత్, అశ్వంత్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ,గ్రామ ప్రెసిడెంట్ రాజేందర్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపిటిసి దేవేందర్, జిల్లా రైతు బంధు నాగుల నర్సయ్య, ఎక్స్ ఎంపిపి రాజారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎక్స్ ఎంపిటిసి బాబా, జి.శ్రీనివాస్, అశోక్, గోపి, అక్తర్, అశోక్, చిట్టి వెంపల్లి తదితర నాయకులు పాల్గొన్నారు.