గ్రూప్ – 1 పాఠ్యాంశాల్లో స్వల్ప మార్పులు..

45
telugu
- Advertisement -

గ్రూప్‌ -1 పాఠ్యాంశాల్లో స్వల్ప మార్పులు చేశారు తెలుగు అకాడమీ అధికారులు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి తేగా, ఎకానమీ పుస్తకం సిద్ధమవుతోంది.

మార్పుల వివరాలు..

కొత్త జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక స్వరూపం మారిపోయింది. పట్టణాలు స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటన్నింటిపై ప్రశ్నలడిగే అవకాశం ఉంది. పెద్ద జిల్లా, చిన్న జిల్లా, అక్షరాస్యత రేటు, లింగ నిష్పత్తి వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకోగా, వాటిని పుస్తకాల్లో చేర్చారు.

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ వివరాలను ఎకానమీ పుస్తకాల్లో చేర్చారు. తాజా జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం గణాంకాలు, సెక్టోరల్‌ ట్రెండ్స్‌, సర్వీస్‌ సెక్టార్‌ ట్రెండ్స్‌, ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ప్రొత్సాహకాలు, పారిశ్రామిక పాలసీలపై ప్రశ్నలుంటాయి.

నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలుగు అకాడమీ పుస్తకాలకు తీవ్ర డిమాండ్‌ నెలకొంది. ఉద్యోగార్ధులు తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పుస్తక విక్రయాలు పెరిగాయి

- Advertisement -