విజయ్-వంశీపైడిపల్లి మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌..

71
- Advertisement -

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విజయ్ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భారీతారాగణం కనువిందు చేయనుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనిపించనున్నారు. వీరితో పాటు.. శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

సూపర్ ఫామ్‌లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి,అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది.

తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
పీఆర్వో: వంశీ-శేఖర్.

- Advertisement -