- Advertisement -
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మిస్తుండగా జూన్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
దీంతో ప్రమోషన్స్‌పై దృష్టిసారించిన చిత్ర యూనిట్ మరో లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది. ఎంత చిత్రం లిరికల్ వీడియో ను రిలీజ్ చేయగా ఈ వీడియో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, కీర్తన వైద్యనాదన్ లు పాడారు.
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నాని సరసన నజ్రియా హీరోయిన్గా నటిస్తోంది. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- Advertisement -