లేడి సింగం..కాబోయే భర్తనే అరెస్ట్!

220
singham
- Advertisement -

ఇలాంటి సీన్స్ మనం సినిమాలోనే చూస్తుంటాం. కానీ అస్సాంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే…అందరి మహిళల లాగానే తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంది ఆ పోలీస్ ఆఫీసర్. తనకు మంచి భర్త దొరికాడని మురిసిపోయింది. వీరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది…కానీ తీరా చూస్తే అతడు మోసగాడు అని తెలిసి తట్టుకోలేకపోయింది. అంతే అతడిపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి కటకటాల పాలు చేసింది.

జున్మోనీ రభా అసోంలోని నాగావ్ లో ఆమె పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు గత అక్టోబరులో రాణా పోగాగ్ తో నిశ్చితార్థం జరిగింది. వారి పెళ్లి ఈ ఏడాది నవంబరులో జరగాల్సి ఉంది. అయితే రాణా పోగాగ్ గతంలో ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. తాను ఓఎన్జీసీలో పనిచేస్తున్నానని, తనకు డబ్బులు ముట్టచెబితే ఓఎన్జీసీలో ఉద్యోగాలు కల్పిస్తానని మోసం చేశారు.

దీంతో బాధితులు జున్మోనీకి ఫిర్యాదుచేయగా కాబోయే భర్త రాణా పోగాగ్ ను అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా బాధితులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితం నాశనం కాకుండా కాపాడారని తెలిపారు.

- Advertisement -