ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ రిలీజైంది. అహ్మదాబాద్‌లో 29న ఫైనల్ జరగనుండగా పుణెలో విమెన్స్ టీ20 చాలెంజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్, కోల్‌కతాలను వేదికలుగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
క్వాలిఫయర్1, ఎలిమినేటర్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్2, ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి కేటాయించారు. ఈనెల 24, 25వ తేదీల్లో ఈడెన్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి.
అహ్మదాబాద్‌లో ఈనెల 27న క్వాలిఫయర్2తో పాటు 29న ఫైనల్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక, మూడు జట్లు పోటీ పడే విమెన్స్ టీ20 చాలెంజ్‌కు పుణె ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 23, 24, 26 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లు, 28న ఫైనల్ జరుగుతుంది.