రాహుల్, రేవంత్‌లపై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు..

78
Rahul gandhi
- Advertisement -

కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ మరియు వివిధ అంశాలపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తుందని ప్రముఖ న్యాయవాది రామారావు ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ఫిర్యాదు దర్యాప్తు చేయనుంది.

ఈ నెల 6న రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 7న ఆయన ఓయూ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, వర్సిటీ పాలక మండలి నుంచి అనుమతి లభించలేదు. దాంతో కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. నిరసనలు తెలిపిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, విద్యార్థి సంఘం నేతలను జైలుకు వెళ్లి పలకరించాలని రాహుల్ భావిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఇప్పటికే జైలు అధికారులకు విజ్ఞాపన పత్రం అందజేశారు.

- Advertisement -