రూ.10తో పోలీస్ కేస్ క్లోజ్!

50
- Advertisement -

కరోనా లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారికి గుడ్ న్యూస్ అందించారు పోలీసులు. లాక్‌డౌన్‌సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వారిపై నమోదైన కేసుల్లో బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఆయా కేసులను క్లోజ్‌ చేసుకోవడానికి ప్రభుత్వం, కోర్టులు ఓ మంచి అవకాశాన్ని కల్పించాయి.

మే 2నుంచి 8వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉందన్నారు. గడువు ముగిసిన తర్వాత జరిమానాలు చెల్లించే వారుంటే వారికి పాతపద్ధతిలోనే వెయ్యిరూపాయలు వసూలు చేయనున్నారు.

కేసు నమోదైన పోలీస్ స్టేషన్‌లో ఆధార్ కార్డును చూపించి కేవలం పది రూపాయలు మాత్రమే కట్టి తమ కేసును క్లోజ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కోర్టుకు వెళ్లకుండానే కేవలం స్థానిక పోలీ‌స్‌స్టేషన్లలోనే కేసును కొట్టేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

- Advertisement -