ఎస్.ఆర్. కళ్యాణమండపం ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూజీ ప్రొడక్షన్స్ బేనర్ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఆదివారం నాడు చిత్ర టీజర్ విడుదలైంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఎం.ఎల్.ఎ. రవీందర్ కుమార్ రావత్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సమ్మతమే టీజర్ చూస్తుంటే దర్శకుడు గోపీనాథ్ చిన్న వయస్సులోనే బాగా తీశాడనిపించింది. ఈరోజే తన పుట్టినరోజుకూడా. సంగీతం బాగుంది. హీరోహీరోయిన్లు చక్కగా కుదిరారు. దర్శకుడిగా గోపీనాథ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానన్నారు.
దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాలోని కృష్ణ సత్యభామ, బుల్లెట్ లా సాంగ్ ఆదరణ పొందాయి. మా టీమ్ మంచి సినిమా తీయాలనే తపనతో పనిచేశాం. జూన్ 24న థియేటర్లలో చూసి ఆనందించండని పేర్కొన్నారు.
హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ, నేను ఏ పాత్రైతే అనుకున్నానో దైవ నిర్ణయంగా ఆ పాత్ర నాకు వచ్చింది. చక్కటి లవ్‌స్టోరీగా రూపొందింది. కిరణ్, గోపీనాథ్, నేను ముగ్గురం షార్ట్ ఫిలింస్ నుంచే వచ్చాం. శేఖర్ చంద్ర చక్కటి బాణీలు ఇచ్చారు. తర్వాత విడుదల కాబోయే ట్రైలర్ మరింత బాగుంటుందని అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, దర్శకుడు గోపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా సినిమా నుంచి గ్లింప్స్, రెండు పాటలు విడుదలయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. సినిమారంగంలోకి రావాలనే 2017లో హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచం అయిన వ్యక్తి గోపీనాథ్. ఇద్దరం షార్ట్ ఫిలింస్ చేశాం. సినిమా తీయాలనే ప్రయత్నాలు చేశాం. ఆ తర్వాత నేను నటించిన రాజావారు రాణివారు, ఎస్.ఆర్. కళ్యాణమండపం విడుదలయి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై మరింత బాధ్యత పెరిగింది. దానితోపాటు బడ్జెట్ కూడా పెరిగింది. అయినా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా దర్శకుడు కేర్ తీసుకున్నాడు. శేఖర్ చంద్ర సంగీతం చాలా బాగుంది. సతీష్ విజువల్స్ హైలైట్ అయ్యాయి. చాందినీ కూడా షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చింది. మా జంట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా మొదలయ్యాక కిరణ్ రెండు సినిమాలు విడుదలయి విజయం సాధించాయి. ఈ సినిమాలో కృష్ణ సత్యభామ, బుల్లెట్ లా సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కింది. దర్శకుడు గోపీనాథ్ మొదటి సినిమా అయినా అన్ని విషయాల్లో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా వున్నాడు. ప్రతి విషయాన్ని కేర్ తీసుకుని చేస్తున్నారు. టీజర్ చాలా ఆసక్తి కరంగా వుంది. చాందినీతో రెండో సినిమా చేస్తున్నాను. ఎడిటర్ విప్లవ్, సతీష్ కెమెరా పనితనం ఇందులో బాగా కనిపిస్తుంది అన్నారు.
నిర్మాత కంకణాల ప్రవీణ తెలుపుతూ, టీజర్‌కు వచ్చిన స్పందనలాగే సినిమాకూ వుంటుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. సమ్మతమే అని ప్రేక్షకులూ అంటారని ఆశిస్తున్నానని తెలిపారు.
సమర్పకుడు కంకణాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చేస్తూనే గోపీనాథ్ షార్ట్ఫిలింస్ చేసేవాడు. మా కుటుంబంలో ఎవరికీ సినిమారంగంలో అనుభంలేకపోయినా తను ఇంట్రెస్ట్ చూపాడు. దర్శకుడిగా మంచి కథతో ముందకు వస్తున్నాడు. సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎడిటర్ విప్లవ్, కోడి దివ్య. కెమెరామెన్ సతీష్ మాట్లాడుతూ, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.