పవన్, గట్టు మను, సోనియా హీరో , హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం `చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే`. సంతోష్ నేలంటి దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై గట్టు వెంకన్న, పవన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లోకి రిలీజైన పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సోమవారం సాయంత్రం సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రాన్ని ఎస్. కె. పిక్చర్స్ డిస్ర్టిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తుంది.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ ` శుభగడియలున్న మంచి రోజున ఈ పాట రిలీజ్ చేశాం. న్యూ కంపోజర్ అయినా మంచి మాస్ సాంగ్ చేశాడు. పాటలన్నీ బాగున్నాయి. ఇలాంటి చిత్రాలు ఆదరిస్తే కొత్త ట్యాలెంట్ బయటకు వస్తుంది. హీరో డ్యాన్సు బాగా చేశాడు. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా` అన్నారు.
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ- `మనందరి మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప పాట చిన్ని చిన్ని నా లో రేగెనే ఆశలు..ఆ పాట పల్లవినే ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ గా పెట్టారు. దీంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. సోనియా తప్ప మిగతా వారంతా కొత్తవాళ్లే. అయినా అందరు బాగా నటించారు. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. కోటి గారు చేతుల మీదుగా పాట రిలీజ్ అవ్వడం హ్యాపీగా ఉంది. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా` అని అన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ “ చక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. ఇప్పుడంతా ప్రేమికుల యుగం. దాదాపు 90 శాతం యూత్ జంటలగానే ఉన్నారు. అలా ఓ కుర్రాడు ప్రియురాలి కోసం ప్రయత్నించి చివరికి అమ్మాయి దొరకక నిరూత్సాహ పడుతోన్న సమయంలో ఓ సిమ్ కార్డు ఆ కుర్రాడి జీవితాన్నే మార్చేస్తుంది. లవర్ లేదనుకుంటోన్న ఆ జీవితంలో వెలుగులు నింపే ఓ ప్రేయసి గుండె తలుపులు తడుతుంది? తర్వాత ఆ కథ ఎలా కంచింకి చేరిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా బాగా వచ్చింది. కొత్త వాళ్లైనా అంతా బాగా నటించారు. వాస్తవానికి ఈ కథను షార్టు ఫిలిం గా ప్లాన్ చేశాం. కానీ అనుకోకుండా సినిమా తీశాం. పెళ్లి చూపులు చిత్రాన్ని ముందుగా షార్ట్ ఫిలిం చేసిన తర్వాత అదే కథను సినిమాగా చేసి సక్సెస్ అయ్యారు. మేము కూడా ఆ కోవలోనే నిలుస్తామన్న నమ్మకం ఉంది. నిర్మాత వెంకన్న గారు ప్రోత్సాహంతో సినిమా ను అనుకున్న టైమ్ లో పూర్తిచేయగలిగాం. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఓ వీడియో సాంగ్ ను లాంచ్ చేశాం. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం` అని అన్నారు.
చిత్ర నిర్మాత గట్టు వెంకన్న మాట్లాడుతూ ` లవ్ స్టోరీ అని ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితయ్యే సినిమా కాదిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ఎక్కడా వల్గారిటీ లేకుండా చక్కగా తెరకెక్కించాం. దర్శకుడు అనుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించారు. నవీన్, మను బాగా నటించారు. సోనాయాకు మరో `హ్యాపీడేస్` మూవీలా నిలిచిపోతుంది. కథలో కొన్ని ట్విస్ట్ ఉంటాయి. సినిమాకు అవి హైలైట్ గా ఉంటాయి. సెన్సార్ కూడా పూర్తయింది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ `యు` సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా చూసి వాళ్లు కూడా ప్రశంసించారు. ఈ మధ్య కాలంలో ఇంతటి క్లీన్ సినిమాలు చూడలేదు. గోహెడ్ అని ప్రోత్సహించారు. అలాగే సంగీత దర్శకులు కోటి గారు ఓ వీడియా సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్చి 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని చూస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.