పెట్రో వార్…ఒకే దేశం..ఒకే ధర?

80
- Advertisement -

చమురు ధరల పెంపుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ పెట్రోల్ ధరలను తగ్గించాలని చురకలు అంటించగా దీనిపై ఘాటుగా స్పందించారు మంత్రి కేటీఆర్.

చమురు ధరల పెంపుకు కేంద్రం విధానాలే కారణమని మండిపడ్డ కేటీఆర్…. ఇలా ప్రత్యేకంగా ఒక రాష్ట్రం పేరు చెప్తారా? ఏ కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం గురించి మీరు మాట్లాడేది అంటూ మోడీని నిలదీశారు. వ్యాట్‌ తగ్గించమని తమ రాష్ట్రం పేరు ఎందుకు ప్రస్తావిస్తారని దుయ్యబట్టారు.

అసలు, తాము వ్యాట్‌ పెంచలేదని స్పష్టం చేసిన కేటీఆర్… 2014 నుంచి ఇప్పటి వరకు తాము వ్యాట్‌ను పెంచలేదని గుర్తుచేశారు. మీ ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లో మా చట్టబద్ధమైన హక్కు 41 శాతం వాటా రావడం… సెస్‌ పేరుతో రాష్ట్రం నుంచి మీరు 11.4 శాతం వాటాను లూటీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి సెస్‌ను రద్దు చేయండి.. అప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ రూ. 70కి, డీజిల్‌ రూ. 60కు వస్తుందని సూచిస్తూ.. వన్‌ నేషన్‌ – వన్‌ రేటు? అంటూ మోడీకి చురకలు అంటించారు కేటీఆర్.

- Advertisement -