దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదైన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.. మళ్లీ కలవరపెడుతోన్న కరోనా కేసులు, ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కోవిడ్ కేసుల తీవ్రత, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.
కోవిడ్ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలని, ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని, టెస్టింగ్, వ్యాక్సినేషన్ అంశాలపైనా ముఖ్యమంత్రులతో మోడీ ప్రధాని మాట్లాడనున్నారు.
దేశంలో కొవిడ్ కేసుల తీవ్రత కలవరానికి గురిచేస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య పెరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసుల పెరుగుదల ఆందోళణ కలిగిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.