చిరు 152 – 158 అప్‌డేట్!

90
- Advertisement -

వరుస సినిమాలతో ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే చిరు నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా దీని తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీతో సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు మెగాస్టార్.

ఇక ఇవి సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలను పచ్చజెండా ఊపారు. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాను ఓకే చేశారు. ఇక తన 157వ సినిమాను మారుతితో ఆ తర్వాత అనిల్ రావిపూడితో మెగా 158 సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉంది.

మొత్తంగా వరుస సినిమాలతో యువ హీరోలకు ధీటుగా సినిమాలను అనౌన్స్‌ చేస్తూ ముందుకుసాగుతున్నారు చిరు.

- Advertisement -