- Advertisement -
ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది సమంత. నా నిశ్శబ్దాన్ని అజ్ఞానంగానూ, నా మౌనాన్ని అంగీకారంగానూ, నా జాలిని బలహీనతగానూ తప్పుగా భావించకండి అని ట్విట్టర్ వేదికగా ఎవరినో టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసింది. అంతేగాదు సెకండ్ ట్వీట్‌లో జాలికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది అంటూ పేర్కొంది. ఇప్పుడు సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ప్రస్తుతం సమంత నటించిన తమిళ చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’ ఈ నెల 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ సరసన సమంత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది గురువారం పూజా కార్యక్రమాలతో మొదలై పోయింది.దీంతో పాటు ఆగస్టు 12న ‘యశోద’, పాన్ ఇండియా మూవీ ‘శకుంతల’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
- Advertisement -

