- Advertisement -
శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేకు ఓ వింత అనుభవం ఎదురైంది. యూపీలో ఫతేహాబాద్ శాసనసభ్యుడు ఛోటేలాల్ వర్మ ఆగ్రాలో సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆలయం వద్దకు తరలివెళ్లారు. ఆయన వెంట భారీగా జనం వచ్చారు.
అయితే పూజలు చేసేందుకు ఓ ఆలయంలోకి వెళ్లి దైవ దర్శనం చేసుకొని తిరిగొచ్చేసరికి ఎమ్మెల్యే బూట్లను దొంగలు మాయం చేశారు. ఎమ్మెల్యే బూట్లు కనిపించకపోవడంతో పోలీసులు, అధికారులు ఆగమేఘాలపై తనిఖీలు చేపట్టారు.
అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదిలేక ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ తన కారు వరకు ఉత్త కాళ్లతోనే నడిచి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -