ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తుండగా ఇక కేజీఎఫ్-2 హిందీలో కొత్త చరిత్ర సృష్టించింది. 5 రోజుల్లో 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డును ‘కేజీఎఫ్-2’ బ్రేక్ చేసింది.
ఈ రికార్డును క్రియేట్ చేయడానికి బాహుబలి 2 మూవీకి 6 రోజులు పట్టగా కేవలం నాలుగు రోజుల్లోనే మొత్తం రూ.193.99 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా అదే ఫామ్‌ను కొనసాగిస్తోంది. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
తొలిరోజే ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు రావడమే దీనికి నిదర్శనం కాగా.. నాలుగు రోజుల్లో ఒక్క హిందీలోనే రూ.193.99 కోట్ల వసూళ్లు రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.546 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది.