షాంఘైలో కరోనా కల్లోలం..!

125
covid
- Advertisement -

చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. షాంఘైలో ఒక్కరోజే 22 వేల కేసులు నమోదుకాగా తొలిసారిగా వైరస్‌తో ఇద్దరు మృతిచెందారు. మృతులిద్దరు 89, 91 ఏండ్ల వయస్కులని, వారు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.

మార్చి మొదటివారం నుంచి ఇప్పటివరకు 3 లక్షల 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి స్థానిక ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నది.

ప్రస్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ కఠినమైన లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. వైద్య సిబ్బంది, డెలివరీ బాయ్స్‌, ఎమర్జెన్సీ స్టాఫ్‌ తప్ప.. ఎవరూ బయట అడుగు పెట్టడానికి వీల్లేదు.

- Advertisement -