తెలంగాణ వెదర్ అప్‌డేట్..

94
weather
- Advertisement -

ఇవాళ,రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్లు ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు,మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాలలో ఎండలు మండిపోతుంటే…మరికొన్ని ప్రాంతాల్లో వానలు కురిసి వాతావరణం చల్లబడుతోంది.

- Advertisement -