మహిళలకు వడ్డీలేని రుణాలు: ఎర్రబెల్లి

81
- Advertisement -

మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సంగారెడ్డి పట్టణంలో డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు, అభయహస్తం కార్పస్ ఫండ్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడేళ్ల కిందట మహిళల పరిస్థితి ఎలా ఉండేదో.. కేసీఆర్‌ పాలనలో ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలన్నారు.

అభయహస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల మంది రూ.545 కోట్లు అభయ హస్తం కింద చెల్లించారని, వారందరికీ వడ్డీతో కలిసి చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్త్రీ నిధి ద్వారా ష్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు మహిళ చనిపోతే రూ.3లక్షలు మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

గుజరాత్‌లో రూ.500 పింఛన్‌ ఇస్తే.. తెలంగాణలో రూ.2016 ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా వచ్చినా అప్పు తెచ్చి పింఛన్‌ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మహిళకు ఆర్థిక శక్తిని ఇచ్చింది సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు మహిళల చేతిలో ఐకేపీ, స్త్రీ నిధి డబ్బులున్నాయన్నారు.

- Advertisement -