317 జీవో తెచ్చింది మీ కోసమే- మంత్రి జగదీశ్ రెడ్డి

43
Minister Jagadish Reddy
- Advertisement -

తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు.. నిధులు… నియామకాలలో భాగంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టేందుకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని, ఇక ఏ ఆటంకాలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడు తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తన మాతృమూర్తి గుంటకండ్ల సావితమ్మ జ్ఞాపకార్థం. మంత్రి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఛైర్మన్‌గా కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అయా విభాగాలలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకున్న యువతీ,యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎస్ ఫౌండేషన్ తరపున ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. లక్ష్యంతో చదివితే విజయం తధ్యం అన్నారు.. చదువు జీవితానికి వెలుగు వంటిదన్న మంత్రి 317 జీవో తెచ్చింది కేవలం నిరుద్యోగ యువతకు లాభం చేకూర్చడం కోసమే అన్నారు. విద్యార్థులకు కావల్సిన పద్దతుల్లో తగిన వసతులతో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఎస్ ఫౌండేషన్ సిబ్బంది, అధ్యాపకులు సర్వ సన్నద్ధం అన్నారు. ఉచిత శిక్షణను విద్యార్ధులు సద్వినియోగం చేసుకుని అధికంగా ఉద్యోగాలు సంపాదించాలని మంత్రి ఆకాంక్షించారు.. ప్రిపరేషన్‌లో ఏమి చేయాలో ఏమి చెయకూడదో అనుభవ అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలని మంత్రి యువతను కోరారు.

ప్రణాళిక బద్దంగా చదివితే ఉద్యోగం వరించడం ఖాయం అన్నారు.. శిక్షణ తరగతుల అవగాహన సదస్సు కు వచ్చిన 1700 మందికి పైగా యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తాను కూడా శిక్షణ సందర్బంలో తరచుగా శిక్షణ తరగతులకు హాజరవుతానని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ ఫౌండేషన్ సీఈవో వీరయ్య,అధ్యాపకులు కొండల్, కో ఆర్డనేటర్ కీసర వేణు గోపాల్ రెడ్డి, ముధి రెడ్డి అనీల్ రెడ్డి, కొమ్ము ప్రవీణ్, దేశగాని శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -