- Advertisement -
చమురు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నా సీఎన్జీ (CNG) ధరలను దేశీయ చమురు పంపిణీ సంస్థలు పెంచాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2.5 పెరగడంతో కీలో సీఎన్జీ ధర రూ.71.61కు పెరిగింది.
నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో కేజీ సీఎన్జీ ధర రూ.74.17గా ఏండగా గురుగ్రామ్‌లో రూ.79.94కు చేరింది. ముంబైలో సీఎన్జీ ధరలు కిలోకు రూ.5 వరకు పెరగడంతో ధర రూ.72కు చేరగా పెట్రోల్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. మార్చి 22 నుంచి 16 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు పెరిగాయి.
- Advertisement -