రేప్ నిందితుడికి గ్రాండ్‌ వెల్‌కమ్‌…సీజేఐ ఫైర్!

96
cji
- Advertisement -

రేప్ నిందితుడికి ఘనస్వాగతం పలకడంపై సీజేఐ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో ఏబీవీపీ విద్యార్థి నాయకుడు శుభాంగ్ గొంటియా ప్రేమ పేరుతో ఓయువతిని మోసం చేశాడు.దీంతో అత్యాచారం కేసులో అరెస్టైన శుభాంగ్‌కు బెయిల్‌ దొరకగా అతని అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. భయ్యా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వేసి ఘనస్వాగతం పలికారు. దీంతో బాధితురాలు నిందితుడి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా.. కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అత్యాచార నిందితుడికి ఘనస్వాగతామా? నిందితుడికి బెయిల్ వస్తే సంబరాలు ఏంటి? అసలు అన్న తిరిగి రావడం ఏంటి? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడి బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీచేశారు. నిందితుడి తరపు లాయర్‌కి చురకలంటించారు సీజేఐ.

తనను మోసం చేశాడని.. పలుమార్లు అత్యాచారం చేసి తనను గర్భవతిని చేశాడని ఓ యువతి కోర్టు కెక్కింది. ఈ కేసులో శుభాంగ్ కొన్నాళ్లు ఆచూకీ లేకుండా పారిపోగా నజరానా కూడా ప్రకటించింది. గతేడాది శుభాంగ్‌ పోలీసులకు చిక్కగా జైలు శిక్ష వేసింది న్యాయస్థానం.

- Advertisement -