మరో రెండు రోజులే..!

78
ts
- Advertisement -

వాహనాదారుల పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండు రోజుల్లో ముగియనుంది. వాస్తవానికి మార్చి 31తోనే గడువు ముగిసిన ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15 వరకు పోడగించారు. నో మాస్క్ కేసులు 90 శాతం మాఫీకానుండగా టూ,త్రీ విలర్ వాహనాలకు 75 శాతం,ఆర్టీసీకి 70 శాతం మాఫీ చేశారు. ఏప్రిల్ నెల నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీలు చేసి చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు పోలీసులు.

ఇప్పటివరకు 2.9 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉల్లంఘనదారులు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి రూ.292 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆన్‌లైన్‌, మీ సేవ కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించగా ఈ రెండు రోజుల్లో మరింత స్పందన వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -