‘సర్కారు వారి పాట’ నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

47
Sarkaru Vaari Paata
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం మే 12న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘కళావతి’, ‘పెన్నీ’ సాంగ్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ మూవీ నుండి తాజా ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్నాం.. ఇంకా ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉందని, మిగితా షూటింగ్ పార్ట్ పూర్తి చేసినట్టు మేకర్స్‌ తెలిపారు. షూటింగ్ పూర్తి కావడంతో.. ఇకపై వరుస అప్‌డేట్స్ అందిస్తామన్నారు. ఇందుకు ఫ్యాన్స్, ఆడియెన్స్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ట్విటర్ వేదికన మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన మహేశ్ బాబు న్యూ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

- Advertisement -