టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం శ్రీవారి సర్వ దర్శనం టికెట్ల జారీ నేపథ్యంలో తొక్కిసలాట జరుగగా ముగ్గురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. భక్తులు ఆధారా కార్డ్ చూపించి దర్శనానికి వెళ్ళిపోవచ్చని టీటీడీ ప్రకటించింది.
రోజు విడుదల చేసే సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్దవేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
ఈ నేపథ్యంలోనే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆరోపించారు. తాగునీరు లేక వందలాది మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారని…. మండుటెండల్లో వస్తున్న భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు.