- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 4,25,03,383 మంది కోలుకోగా 5,21,691 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులున్నాయి.
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,85,74,18,827 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -