ఎంఐఎం కార్పొరేటర్‌పై కేటీఆర్‌ సీరియస్‌..

111
ktr
- Advertisement -

హైదరాబాద్ భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ మొహ్మద్ గౌసుద్దీన్ పోలీసులపై అనుచిత ప్రవర్తన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పోలీసులను గౌసుద్దీన్ దుషిస్తుండటం అందులో స్పష్టంగా వినిపిస్తుండగా ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, వాళ్లతో దురుసుగా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్‌ బుధవారం కోరారు. తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని…ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా ఆ వ్యక్తులను వదలొద్దంటూ సూచించారు.

- Advertisement -