మంగళవారం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్లి ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా జగన్ ప్రధాని మోదీతో సమావేశమైయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు మోదీతో జగన్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీతో జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం.
ఈ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు మొదలుకానున్న ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకతలపై నిర్మలతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీ ముగిసిన తర్వాత రాత్రి 9.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.