రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్ రద్దు.. !

78
radisson hotel
- Advertisement -

హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో అభిషేక్ పుప్పాల, అనిల్‌ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న కిరణ్ రాజు,అర్జున్‌ల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశారు. ఇక అభిషేక్, అనిల్‌ ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఇక ఇవాళ ర్యాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ తో పాటు పుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్‌ను, లిక్కర్ లైసెన్సును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బంజారా హిల్స్ ప‌రిధిలో ఏళ్ల త‌ర‌బ‌డి రాడిసన్ హోటల్ కార్యకలాపాలు సాగిస్తోంది.

గతంలో 24 గంటలపాటు లిక్కర్‌ సరఫరాకు ఎక్సైజ్ శాఖ నుంచి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. ఈ ఏడాది జనవరి 7న లిక్కర్‌ లైసెన్స్‌కి అనుమతి లభించింది. రూ.56 లక్షల బార్‌ ట్యాక్స్‌ చెల్లించి రాడిసన్ హోటల్ లైసెన్స్‌ పొందింది. 2020 వరకు భార్యతో కలిసి కిరణ్ రాజు పబ్‌ను నడిపాడు. 2020 ఆగస్టులో అభిషేక్, అనిల్‌కుమార్‌కు కిరణ్ రాజు లీజుకిచ్చాడు. వీరికి లీజుకిచ్చినప్పటికి కిరణ్ రాజు భాగస్వామగానే ఉన్నారు.

- Advertisement -