టీకాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ…

73
rahul
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి జగ్గారెడ్డి, వీహెచ్‌లకు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఈ సమావేశం వాడివేడిగా సాగే అవకాశం ఉంది.

పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల పై ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.2023 ఎన్నికలకు క్యాడర్ ని సమాయత్తం చేయాలని భావిస్తోంది.

ఈ సమావేశంలో రాహుల్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తన మనసులో మాట బయటపెట్టారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీచేస్తానంటున్నారు. కామారెడ్డి నుంచి ఆయన పోటీచేసే అవకాశం ఉంది.

- Advertisement -