వింత సంఘటన.. మేకను పెళ్లాడిన యువ‌కుడు..

164
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నూజివీడు ప్రాంతంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. దోష నివారణ కోసం అంటూ మేకను పెళ్లి చేసుకున్నాడు ఓ యువ‌కుడు. ఆ యువకుడికి జన్మజాతక రీత్యా రెండు వివాహాలు జరుగుతాయని ఉందట.. దీంతో దోష నివారణ నిమిత్తం పట్టణ పరిధిలోని విస్సన్నపేట రోడ్డులో ఉన్న నవగ్రహ ఆలయ ఆవరణలో అర్చకులు ఆ యువకుడితో మేకకు తాళి కట్టించి వివాహం జరిపించారు. ఈ తంతులో యువకుడు, అతని తల్లిదండ్రులు, అర్చకుడు మాత్రమే పాల్గొన్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

- Advertisement -