‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేస్తోంది..

140
- Advertisement -

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇదివరకు విడుదలైన ‘ఆచార్య’ టీజర్, మూడు సింగిల్స్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. శనివారం ఉగాది సందర్భంగా ‘ఆచార్య’ మేకర్స్ ప్రేక్షకులకు విషెస్ తెలుపుతూ.. ట్రైలర్ లోడ్ అవుతోందని, మాస్ట్ ఫీస్ట్‌కు రెడీగా ఉండమంటూ అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో రూపంలో తెలిపారు. ఇక ఇందులో సిద్ధ అనే ప్రత్యేక పాత్రలో రామ్‌చరణ్ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయబోతున్నాడు.

- Advertisement -