- Advertisement -
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పూణెలోని ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె నిన్న మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూణె నుంచి వస్తున్న సమయంలో ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ఖలాల్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో మూడుకార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలోనే ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. ఆమె నుదిటిపై స్వల్పంగా గాయాలయ్యాయి దీంతో వెంటనే ఆమెను నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
మలైకా నుదిటిపై స్వల్పంగా గాయాలయ్యాయని, సీటీ స్కాన్‌లో అంతా బాగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె సోదరి అమృతా అరోరా కూడా మీడియాకు తెలిపారు. ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతుండగా, ఆమెతోపాటు బాడీగార్డ్ కూడా ఉన్నాడని సమాచారం.
- Advertisement -