ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని…ఆర్టీసీ గట్టెక్కాలంటే చార్జీల పెంపు తప్పనిసరి అన్నారు ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. గతంతో పోల్చుకుంటే ఆర్టీసీకి ఆదరణ పెరిగింద…. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రానున్న రోజుల్లో కొత్త బస్సులు కొనుగోలు చేయబోతున్నాం అన్నారు.
ఎవరినీ కావాలని సంస్థ నుంచి పంపించేందుకు ఒత్తిడి చేయడం లేదని, వీఆర్ఎస్ తీసుకోమని చెప్పడం లేదని…ఒకే పద్ధతిలో కొనసాగుతున్న సంస్థలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ఛార్జీల పెంపు సంస్థ తీసుకున్న నిర్ణయమని, ఈ పెంపుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సంస్థ బతికి బట్టకట్టాలంటే చార్జీలు పెంచాల్సిందేనని, త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయనుందని తేల్చి చెప్పారు.
వీఆర్ఎస్పై ఉద్యోగులెవరినీ బలవంతం చేయడం లేదని, ఇష్టం ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు ఎండీ సజ్జనార్. వీఆర్ఎస్ కోసం ఇప్పటివరకు దాదాపు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.