రష్యాను ధీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్..

124
ukraine
- Advertisement -

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్‌ హెలికాప్టర్‌ను లుహాన్స్‌క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ కూల్చేసింది.

ఇక స్టార్‌స్ట్రీక్‌ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్‌ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. యుద్ధంలో రష్యా ఇప్పటిదాకా కనీసం 143 యుద్ధవిమానాలు, 131 హెలికాప్టర్లు, 625 ట్యాంకులు, 316 సైనిక వాహనాలను కోల్పోయినట్టు సమాచారం.

- Advertisement -