ఐపీఎల్‌ 2022: టాస్ గెలిచిన కోల్ కతా

91
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్‌ 2022)లో ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. సఫారీ స్టార్ పేసర్ కగిసో రబాడా పంజాబ్ జట్టులోకి వచ్చాడు. రబాడా కోసం సందీప్ ను తప్పించారు. రబాడా రాకతో పంజాబ్ బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక, కోల్ కతా జట్టులో షెల్డన్ జాక్సన్ ను తప్పించి శివమ్ మావిని తుదిజట్టులోకి తీసుకున్నారు.

ముఖాముఖి పోరులో కేకేఆర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే… పంజాబ్ 10 మ్యాచ్ ల్లో నెగ్గింది.

తుది జట్లు :

కేకేఆర్ : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్, రహానే, నితీశ్ రాణా, బిల్లింగ్స్, , రస్సెల్ నరైన్, సౌతీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తి.

పంజాబ్ : మయాంక్ అగర్వాల్, ధావన్, భానుక రాజపక్స, లివింగ్ స్టోన్, రాజ్ బవ, షారుఖ్ ఖాన్ , ఒడెన్ స్మిత్, హర్పీత్ బ్రార్, అర్ష్ దీప్, కగిసో రబాడా, రాహుల్ చహర్

- Advertisement -