దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బిజేపి వాళ్లు మొదటి నుండి చెపుతూనే ఉన్నారు మనకే అర్దం కావడం లేదుని చురకలంటించారు. పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం,కార్పొరేట్ సంస్థల సంపాదన డబుల్ చేయడం,నిత్యవసర వస్తువుల ధరలు డబుల్ చేయడం,గ్యాస్ ధరలు డబుల్ చేయడం ఇదే డబుల్ ఇంజన్ అంటే అని సరికొత్త అర్ధం చెప్పారు.
ఇక గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మోదీ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2014కు ముందు ప్రధాని మోదీ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు. పెట్రో ధరల పెంపు విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని మోదీ ప్రశ్నించిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాడు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మోదీ చేసిన మరో ట్వీట్‌ను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు.