- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1233 కరోనా కేసులు నమోదుకాగా 31 మంది మరణించారు. మొత్తం కేసులు 4,30,23,215కు చేరగా ఇప్పటివరకు 4,24,87,410 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,704 యాక్టివ్ కేసులుండగా 5,21,101 మంది బాధితులు మృతిచెందారు.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉండగా రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,83,82,41,743 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -