టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిన్న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తొలి రోజు ‘బాహుబలి 2’ రికార్డ్తోపాటు… ఆ సినిమా తర్వాత వచ్చిన చిత్రాల రికార్డునూ బద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన వసూళ్లు మామూలుగా లేవు. తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో తొలిరోజు వసూళ్లు సాధించిన సినిమా ఇదే.
అందరూ ఊహించినట్లుగానే RRR మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నైజాంలో ఏకంగా రూ. 23.35 కోట్లు వసూలు చేసింది. నైజాంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు రూ.11.85 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప సినిమాకు రూ.11.44 కోట్లు, ప్రభాస్ రాధేశ్యామ్ మూవీకి రూ.10.80 కోట్లు, ప్రభాస్ సాహో చిత్రానికి రూ. 9.41 కోట్లు, బాహుబలి 2 సినిమాకు రూ. 8.9 కోట్లు, పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీకి రూ.8.75 కోట్ల వసూళ్లు వచ్చాయి.
మరోపక్క, భారత దేశ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సెట్ చేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇక కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం హిట్ టాక్తో దూసుకుపోతోంది.