రెండోసారి తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకని సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు యోగి ఆదిత్యనాథ్. లక్నో అటల్ స్టేడియంలో యోగి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగగా ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఒకే ఒక్క ముస్లిం నేతకు చోటు దక్కింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు డానిష్ అజాద్ అన్సారి.
గత యోగి సర్కార్లో మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మొహిసిన్ రజా స్థానంలో ఈసారి చోటు దక్కించుకున్నారు. సహాయ మంత్రిగా అన్సారీ ప్రమాణస్వీకారం చేశారు.
అలాగే కేశవ్ ప్రసాద్ మౌర్యకు డిప్యూటీ సీఎం పదవి వరించగా దినేష్ శర్మను మాత్రం, బ్రాహ్మణ లీడర్ బ్రజేష్ పాతక్ తో రీప్లేస్ చేసింది. సురేష్ ఖన్నా, సూర్యప్రతాప్ సాహి, స్వతంద్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, మాజీ బ్యూరోక్రాట్ ఏకే శర్మ, కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు యోగి కేబినెట్ లో చోటు దక్కింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు 273 స్థానాలు దక్కగా బీజేపీకే 255 సీట్లు వచ్చాయి.