రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న ఎంపీ రూపా గంగూలీ..

71
- Advertisement -

ఇవాళ ఎంపీ రూపా గంగూలీ రాజ్యసభలో మాట్లాడుతూ ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. బెంగాల్‌ను ఆదుకోవాల‌ని ఈ ఎంపీ కన్నీటి పర్యాంతమైయ్యారు. బెంగాల్‌ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. రాజ్య‌స‌భలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న బీర‍్బమ్‌ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఈ ఘటన పార్లమెంట్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఎంపీ రూపా గంగూలీ ఈ ఘటనపై రాజ్యసభలో మాట్లాడుతూ.. అటాప్సీ రిపోర్ట్ ప్ర‌కారం.. తొలుత అక్క‌డ వాళ్ల‌ను కొట్టిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. కొట్టిన త‌ర్వాత సామూహిక హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు రూపా ఆరోపించారు. బెంగాల్‌ నుంచి జ‌నం పారిపోతున్నార‌ని గంగూలీ ఆరోపించారు. భార‌త్‌లో బెంగాల్ భాగ‌మ‌ని, అక్క‌డ జీవించే హ‌క్కు ఉంద‌ని, మేం బెంగాల్‌లో పుట్టామ‌ని, అక్క‌డ పుట్ట‌డం త‌ప్పుకాదు అని, ద‌క్షిణేశ్వ‌ర్‌ మ‌హాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడారు. భావోద్వేగంతో ఏడ్చేశారు. ఆ స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. తృణ‌మూల్ ఎంపీలు నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు.

- Advertisement -