బీజేపీ నాయకుల్లారా కబడ్ధార్.. బండిపై మంత్రి గంగుల ఫైర్‌..

103
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ఈరోజు ఆయన జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటి మీద బీజేపీ ముష్కరులు దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. కబడ్ధార్ బీజేపీ నాయకుల్లారా. మా బలం ముందు మీ బలం చిన్నది. మంత్రిగా రాలేదు ఒక టీఆర్‌ఎస్ కార్యకర్తగా వచ్చాను. మా కార్యకర్తకు గాయమైన మాకు నొప్పి కలుగుతుందన్నారు.

మొన్న టీఆర్‌ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు జాయిన్ అయ్యారు.. అది చూసి జీర్ణించుకోలేక అసహనంతో మా పై దాడికి చేశారు. రాం చందర్, సాయి సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టారు. మెస్సేజ్ లు పెట్టి రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.. చట్టాన్ని గౌరవించాలని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే మాపై రాళ్లు రువ్వారు. గోపి అనే వ్యక్తి తుపాకీ, కర్ర పట్టుకొని దాడికి యత్నం చేశారు మంత్రి అన్నారు.

బీజేపీ నాయకులు యూపీ, గుజరాత్, బీహార్ సాంస్కృతిని తీసుకువస్తున్నారు. విద్వాంసన్ని, దాడులనే నమ్ముకున్నారు. దీనిపై బండి సంజయ్ స్పందించాలి. ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి తెలిపారు.. పోలీసు స్టేషన్ మీద రాళ్లు వేస్తారా? సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ఎవరికి ఇబ్బంది కలిగిన అండగా ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగిన తీవ్ర పరిణామాలు ఉంటాయని.. సోషల్ మీడియాను కంట్రోల్‌గా ఉంచాలని డీజీపీ కి విన్నపం చేశారు. అసభ్యంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకునేలా అదేశాలివ్వండి అని మంత్రి గంగుల పేర్కొన్నారు.

- Advertisement -