మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్‌..

87
- Advertisement -

ఈరోజు మంత్రి కేటీఆర్‌ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈమేరకు ఆయన కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు, నగరంలో ప్రతి రోజు మంచి నీటి సరఫరా పథకం పైలాన్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించి 24 గంటల మంచి నీటి సరఫరా కోసం చేపట్టే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వోడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -