అఖండ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నటిసింహా నందమూరి బాలకృష్ణ, క్రాక్ వంటి సక్సెస్ఫుల్ తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో బాలయ్య107వ సినిమాగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు.
ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌కు మంచిరెస్పాన్స్ వస్తోంది. ముసలి మాడుగు ప్రతాప్ రెడ్డిగా దునియా విజయ్ లుక్ అదిరిపోయింది. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.