25న ఆర్ఆర్ఆర్…ప్రమోషన్స్‌కు సీఎం!

99
rrr
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎట్టకేలకు ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌పై దృష్టిసారించిన చిత్రయూనిట్ తాజాగా ముఖ్యమంత్రినే రంగంలోకి దించనున్నారు.

సినిమా కోసం రెండు భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తుండగా, అందులో ఒకరు దుబాయ్ లో, రెండు కర్ణాటకలో జరగనున్నాయి. ఈ నెల 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై రానున్నారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు.

- Advertisement -