పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్‌లో సగం కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మించారు. కృష్ణం రాజు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా థమన్ నేపథ్య సంగీతం అందించాడు.
తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ రాధేశ్యామ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ‘ఒక సినిమాకు కావలిసిన దానికన్నాఎక్కవ విజువల్స్, ఎక్కువ విఎఫ్ఎక్స్, ఎక్కువ లోకేషన్లు పెట్టడంవల్ల ఆడియన్స్ స్టోరీ కంటే వాటికే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా అది ఆర్టిఫీషియల్ స్టోరి టెల్లింగ్ అవుతుంది. బాహుబలి అంత కలెక్ట్ చేయడానికి కారణం అన్ని ఎలిమెంట్స్ సమానంగా బ్యాలెన్స్ చేయడం.. ప్రభాస్‌ని పెడితే కొంత వరకు కలెక్షన్ వస్తాయి, కానీ మిగితాది అంతా ప్రేక్షకుడికి నువ్వు కథను ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నావు అనే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది’ అంటూ పేర్కొన్నాడు.